రానా గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!
December 14, 2016 / 03:17 PM IST
మూవీ మొఘల్ రామానాయుడు మనవడిగా చిత్ర సీమలోకి అడుగు పెట్టినా, తనకంటూ సొంత పేరుని సాధించడానికి రానా చాలా శ్రమించారు. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్ తన వెనుక ఉన్నప్పటికీ వారి పేరు ఉపయోగించుకోకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న విలన్ లాంటి హీరో జీవితంలోని కొన్ని రహస్యాలు..
1 . యాక్టర్ కంటే ముందు బాస్నటనలోకి రాక ముందే రానా బిజినెస్ లో అడుగు పెట్టారు. స్పిరిట్ మీడియా అనే కంపెనీ స్థాపించి 85 సినిమాలకు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసారు. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ నటనపై ఉన్న ఆసక్తితో దానిని అమ్మేసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
2 . నిర్మాతగా అవార్డులుతాత, తండ్రి తరహాలో పాతికేళ్లకే రానా నిర్మాతగా మారారు. బొమ్మలాట(2004 ) అనే మూవీని ప్రొడ్యూస్ చేసి జాతీయ అవార్డు అందుకున్నారు. మహేష్ సైనికుడు చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్ గా చేసి నంది అవార్డు సాధించారు.
3 . అనుకోకుండా పుస్తకాలపై ప్రేమరానా లో ఎవరికీ తెలియని యాంగిల్ పుస్తకాల ప్రేమికుడు. తీరిక దొరికితే బుక్స్ చదువుతుంటారు. పుస్తకాలపై ప్రేమ అనుకోకుండా కలిగిందట. స్కూల్ డేస్ లో రానా బూతు పుస్తకం చదువుతుంటే టీచర్ కి దొరికి పోయారు. అప్పుడు ప్రిన్స్ పాల్ పుస్తకాలు చదవడం ఇష్టం అయితే.. ఇది చదువు అని “ద గాడ్ ఫాదర్” బుక్ ఇచ్చారంట. అది చదివిన తర్వాత పుస్తకాల పురుగు అయిపోయారు.
4 . ఫుడీసినీ పరిశ్రమలో ఉండేవారికి ఎంత తినాలని ఉన్నా చాలా కంట్రోల్ చేసుకుంటారు. రానా మాత్రం అవేమి పట్టించుకోరు. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఆహరం విషయంలో కంట్రోల్ చేసుకోలేదు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిరోజుల క్రితమే ఫుడ్ టూర్ కి వెళ్లి వచ్చారు. అందుకే టాలీవుడ్ లో ఫుడీ అవార్డు ఇవ్వాలంటే రానా పేరు పరిశీలించాల్సిందే.
5 . క్రీడల్లో ప్రావీణ్యంరానా కి ఆటలంటే ఇష్టం. చిన్నప్పుడు బాక్సింగ్ బాగా ఆడేవారు, ఓ సారి ముక్కు ఎముక విరగడంతో అటు వైపు వెళ్లలేదు. తర్వాత ఎతుల్లోంచి నీళ్ళల్లో దూకడం హాబీగా చేసుకున్నారు. చాలా లోతున్న నదుల్లో కూడా ఈజీగా అడుగుకు వెళ్లి రాగలరు. ఇప్పుడు కబడ్డీని ప్రోత్సహించే పనిలో పడ్డారు.
6 . తెలుగు పై పట్టురానా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తెలుగుపై పట్టు రావాలని ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టుకున్నారు. ఇంటర్ లో కూడా సెకండ్ ల్యాంగ్వేజ్ తెలుగు తీసుకున్నారు. మీరు ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే తెలుగులో క్లాస్ టాప్ స్కోర్ రానాదే.
7 . బేస్ వాయిస్కొన్ని ప్రత్యేక డైలాగులు చెప్పాలంటే బేస్ వాయిస్ అవసరం. అంతేకాదు అంతే డిక్షన్ తో చెప్పగలగాలి. ఆ ప్రతిభను గుర్తించే రాజమౌళి భల్లాల దేవా క్యారెక్టర్ ని అతనికి ఇచ్చారు. దర్శకధీరుడు పెట్టుకున్న అంచనాలకు మించి రానా డైలాగ్ చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.
8 . పర్ఫెక్ట్ ఫిట్లీడర్, బాహుబలి సినిమాల్లో రానా లుక్ ని గమనిస్తే చాలా తేడా కనిపిస్తుంది. తొలి చిత్రంలో సన్నగా కనిపించిన రానా భల్లాల దేవా గా పూర్తి ఫిట్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అతను బాడీని మలుచుకున్న తీరు యువతకి స్ఫూర్తి నిచ్చింది. భారీగా తినడమే కాదు.. అందుకు తగ్గట్టుగా జిమ్ ల్లో ఎక్కువ సమయం చెమటని చిందించేవారు.
9 . ఆది నుంచే ప్రయోగాలుచిత్రసీమలో హీరోగా నిలదొక్కుకున్నప్పుడు ప్రయోగ చిత్రాలు చేయడం ఆనవాయితీ. రానా మాత్రం ఆది నుంచే కొత్త కథలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఫలితాలు నిరాశ పరిచినా తన ప్రయోగ తత్వాన్ని మార్చుకోలేదు. ఆ విషయం అతను చేసిన లీడర్, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుమ్ , రుద్రమదేవి, ఘాజి సినిమా కథలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
10 . ఆదుకునే మనస్తత్వంరానాని చాలా మంది కొబ్బరి కాయతో పోలుస్తుంటారు. టెంకాయ కి ఆయనకి లింకేమిటని అయోమయంలో పడకండి. కోకోనట్ బయట స్ట్రాంగ్ గా లోపల మెత్తగా ఉంటుంది. రానా కూడా అంతే. చూసేందుకు గంభీరంగా ఉంటారు. మనసు మాత్రం వెన్న. కష్టాలను చూస్తే ఇట్టే కరిగిపోతారు. వైజాక్, చెన్నై, హైదరాబాద్ లో వరదలు ముంచెత్తినప్పుడు రానా చాలా హెల్ప్ చేశారు. అనేక సహాయక చర్యలో పాల్గొని మంచి మనసును చాటుకున్నారు.