ఎన్టీఆర్, ఎంజీఆర్ లు జోగేంద్ర లో కనిపిస్తారు : రానా
August 3, 2017 / 08:24 AM IST
|Follow Us
తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటించిన చిత్రం ‘నేనే రాజు నేను మంత్రి’. ఈ మూవీ టీజర్ రిలీజ్ నుంచి చూడాలనే ఆత్రుతని పెంచింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో సురేశ్ బాబు, ఎం.వి.కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (ఆగస్టు 11 ) థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ‘జోగేంద్ర యువగర్జన’ కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేదికపై రానా ఉద్వేగంతో మాట్లాడారు. “నందమూరి తారక రామారావుగారు నాకు సినిమాల పరంగా, వ్యక్తిగతంగా దేవుడులాంటివారు. ఆయన ఫిలాసఫీతో పాటు, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీ కూడా జోగేంద్ర పాత్రలో ఉంటుంది. అందుకే ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా చేశా. ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన చిత్రమిది. చాలా బాగా వచ్చింది. గర్వంగా ఉన్నా” అని అన్నారు.
“జోగేంద్ర పాత్రను మా తాత చూడలేకపోయారనే లోటు ఉంది. ఆయనతో సినిమా చేయలేకపోయాననే బాధ కూడా నాలో ఉంది” తనలోని బాధను వ్యక్తం చేశారు. తన తండ్రి, బాబాయ్ (వెంకటేష్) అభిమానులు తోడున్నారన్న ధైర్యంతోనే పర భాషా చిత్రాలూ చేస్తున్నానని వివరించారు. మీరు ఇదే సపోర్ట్‌ని కొనసాగిస్తే హాలీవుడ్ సినిమా కూడా చేస్తానని కార్యక్రమానికి హాజరైన ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పారు. కాజల్ అగర్వాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించిన ఇందులో నవదీప్ కీలక రోల్ పోషించారు. ‘నేనే రాజు నేను మంత్రి’ కి అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం ప్లస్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.