Miheeka: చీకటి బతుకులలో వెలుగులు నింపిన మీహీక.. గ్రేట్ అంటూ ప్రశంసలు!
April 6, 2023 / 04:38 PM IST
|Follow Us
దగ్గుబాటి వారసుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా మిహీక అనే అమ్మాయిని ప్రేమించి 2020వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత రానా దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా చాలా సంతోషంగా గడుపుతున్నారు. మిహీక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె పలు వ్యాపార రంగంలో రాణిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మిహీక తన దాంపత్య జీవితం గురించి ఏ విధమైనటువంటి అసత్యపు వార్తలు ప్రచారం అవుతున్న వెంటనే వాటిపై స్పందిస్తూ పూర్తిగా ఆ వార్తలను ఖండిస్తారు.
ఇలా గతంలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రాగ వెంటనే రియాక్ట్ అయిన (Miheeka) మిహీక ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఇకపోతే వృత్తి పరమైన వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి ఈమె ఎర్త్ యాంగిల్స్ అనే ఒక ఎన్జీవో సంస్థతో కలిసి కొని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మిహీక చేస్తున్నటువంటి మంచి పనులపై నటి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇండియాలోనే మారుమూల గ్రామంలో ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం లాగా చీకటిలోనే బ్రతుకుతున్నారు ఇలా చీకటిలో బ్రతుకుతున్న వారికి ఈమె సోలార్ విద్యుత్ దీపాలను అందజేస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపారు. చిన్న సోలార్ ప్యానల్ కి కనెక్ట్ అయిన బల్బ్ పేద వారి ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతోంది.
ఇలా ఎందరికో ఈ విధమైనటువంటి సోలార్ విద్యుత్ దీపాలను అందజేయడంతో ఎర్త్ యాంగిల్స్ ఎన్జీవో సమస్త వారు రానా దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి ఈమె మంచి మనసు పై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.