Miheeka: ఏ పని చేయకపోవడంలోను ఓ స్వీట్ నెస్ ఉంటుంది!
April 5, 2023 / 07:09 PM IST
|Follow Us
మిహికా బజాజ్ పరిచయం అవసరం లేని పేరు దగ్గుబాటి కోడలుగా, రానా భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. రానా మిహిక బజాజ్ ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. గతంలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేశాయి. ఈ విధంగా తమ గురించి ఎలాంటి వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే మిహికా స్పందిస్తూ వాటికి చెక్ పెడుతూ ఉంటారు.
ఇక గతంలో ఓసారి బొద్దుగా కనిపించడంతో ఈమె (Miheeka) తల్లి కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఈమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మిహిక కొట్టి పారేశారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు. ఈమె బీచ్ లో ఒంటరిగా నడుస్తూ ఉన్నటువంటి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏమీ చేయకుండా ఉండటంలో కూడా ఓ స్వీట్ నెస్ ఉంటుంది అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీడియో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్స్ ఈ వీడియో పై వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఈ వీడియోలో ఈమె డ్రెస్ ఒదులుగా ఉండటంతో మీహికా మీరు ప్రెగెంటా అని కామెంట్స్ చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు చేస్తున్నారు. గతంలో కూడా ఈమె కాస్త బొద్దుగా మారడంతో ప్రెగెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని మిహీకా ఈ వార్తలను కొట్టి పారేశారు.
తాజాగా మరోసారి ఈ వీడియో పై కొందరు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.మిగతా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ బిజినెస్ రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.