Rana, Miheeka: పెద్ద చర్చకు దారి తీసిన మిహీక లేటెస్ట్ ఫోటో.. ‘నా ఏంజెల్ అంటూ పాపతో..!
November 5, 2022 / 04:53 PM IST
|Follow Us
దగ్గుబాటి రానా ఈ మధ్యనే తన పెళ్లి రోజు నాడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు డిలీట్ చేశాడు. ముఖ్యంగా తన భార్యతో ఉన్న ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా అంటూ కామెంట్లు వినిపించాయి. కానీ ఆ వెంటనే ‘కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు,సినిమాలతో కలుద్దాం అన్నట్టు… బిగ్గర్- బెటర్- స్ట్రాంగర్.. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యు’ మిహీకా బజాజ్ ఎకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు రానా.
అదలా ఉంటే.. మొన్నటికి మొన్న మిహీక తన కజిన్ వెడ్డింగ్‌లో పాల్గొన్నప్పుడు తీసుకున్న ఫోటోలలో కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని అంతా పొరబడుతూ రాసుకొచ్చారు. అందులో నిజం లేదని మిహీక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇక తాజాగా మిహీక ఓ పాపను ఎత్తుకుని తీసుకున్న ఫోటోని షేర్ చేసి ‘నా ఏంజెల్ తో మొదటి ఫోటో .. ప్రేమతో మిహీకా బజాజ్’ అంటూ రాసుకొచ్చింది.
దీంతో రానా- మిహీక లు సరోగసి పద్ధతి ద్వారా ఓ పాపకు జన్మనిచ్చారా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఇటీవల నయన్ – విగ్నేష్ లు సరోగసి పద్ధతి ద్వారా కవలలకు జన్మనివ్వడంతో ఇలాంటి అనుమానాలు రానా దంపతుల పై వ్యక్తమయ్యాయి. వీటికి కూడా మిహీక వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆ పాప తన మేనకోడలు అంటూ మిహీక తెలిపింది. దీంతో ఈ టాపిక్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది.