ఆ ఘనత దక్కించుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీగా హిరణ్యకశ్యప
June 25, 2020 / 09:00 AM IST
|Follow Us
సినిమా మొదలుకాకుండానే దగ్గుబాటి రానా రికార్డుల మోత మోగిస్తున్నాడు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న హిరణ్య కశ్యప మూవీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ ఎంటటైన్మెంట్స్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామి కానుంది. ఫాక్స్ స్టార్ నిర్మాణ భాగస్వామిగా తెరకెక్కనున్న ఫస్ట్ సౌత్ ఇండియా మూవీగా హిరణ్య కశిప నిలవనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రం కోసం… గుణ శేఖర్ తనటీంతో 4ఏళ్లుగా కష్టపడుతున్నాడు.
2015 లో రుద్రమ దేవి మూవీ చేసిన గుణశేఖర్, ఐదేళ్ల నుండి మరో చిత్రం చేయలేదు. ఏళ్లుగా ఆయన ఇదే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఆయన హిరణ్య కశ్యప స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఉంది. ఇక ఈ మూవీని హాలీవుడ్ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నారు. దీనికోసం కీలక సాంకేతిక నిపుణులు అందరూ హాలీవుడ్ కి చెందినవారిని తీసుకుంటున్నారు. ఆర్ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ, స్టంట్ మాస్టర్స్ అందరూ హాలీవుడ్ కి చెందినవారే అని సమాచారం.
ఇక ఈ చిత్రం ప్రో ప్రొడక్షన్ పనుల కోసమే దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా ఈ మూవీలో రాక్షసరాజు హిరణ్య కశ్యపుడిగా రానా నటించనున్నారు. నెగెటివ్ రోల్ ని ప్రధానంగా తీసుకొని గుణ శేఖర్ ఈ కథను ఎలా మలచనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్ల పై మాటే అని వినిపిస్తున్న టాక్. పాన్ ఇండియా మూవీగా అనేక భాషలలో విడుదల కానుంది.