Ranga Ranga Vaibhavanga: ‘రంగ రంగ వైభవంగా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
September 2, 2022 / 05:26 PM IST
|Follow Us
‘ఉప్పెన’ కొండపొలం’ వంటి చిత్రాల అనంతరం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ టీజర్, రెండు పాటలు వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేశాయి. దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
2.50 cr
సీడెడ్
1.24 cr
ఉత్తరాంధ్ర
0.80 cr
ఈస్ట్
0.55 cr
వెస్ట్
0.50 cr
గుంటూరు
0.53 cr
కృష్ణా
0.58 cr
నెల్లూరు
0.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.60 cr
ఓవర్సీస్
0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
8.12 cr
‘రంగ రంగ వైభవంగా’ చిత్రానికి రూ.8.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా ఈజీ టార్గెట్. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. సినిమాకి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు బలంగా ఉన్నాయి.
వైష్ణవ్ గత చిత్రాలు ‘ఉప్పెన’ భారీగా రూ.50 కోట్ల పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. కానీ ‘కొండపొలం’ మాత్రం రూ.6 కోట్లకే అవుట్ అయ్యింది.వైష్ణవ్ కి స్ట్రాంగ్ మార్కెట్ ఇంకా ఏర్పడలేదు. మరి ఈ ‘రంగ రంగ వైభవంగా’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.