రంగస్థలం రీమేక్ హక్కుల కోసం అడుగుతున్నారు – రామ్ చరణ్
May 6, 2018 / 04:23 AM IST
|Follow Us
సుకుమార్, రామ్ చరణ్ తేజ్ కలయికలో రూపుదిద్దుకున్న సినిమా “రంగస్థలం”. 1980 నాటి కథలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మి’గా నటించి అదరగొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై ఘన విజయం సాధించింది. 200 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన చెర్రీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడాన్ని ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. “‘చాలా సంతోషంగా ఉంది. మేమంతా ఏడాదిన్నర కష్టపడ్డాం. దాని ఫలితంగా సినిమా చక్కగా వచ్చింది. ఇంత చక్కటి స్పందనకు మించి ఇంకేమి అడుగుతాం. నటుడిగా ఈ చిత్రంతో చాలా సంతృప్తి చెందా’ అని అన్నారు.
బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో రంగస్థలం గుర్తింపు పొందడంపై చరణ్ స్పందిస్తూ… “ముందుగా ‘బాహుబలి’ టీమ్ కి థాంక్స్. ఇది ఓ పెద్ద సినిమా. గత కొన్నేళ్లుగా బాహుబలి తర్వాత అనేక సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అయినా రంగస్థలం సినిమాకి గుర్తింపు రావడం వెనుక బలమైన కారణం ఉంది. ఈ సినిమా కథల్ని మేం కమర్షియల్ హిట్ కోసం కాకుండా దాదాపు సహజంగా ఉండాలని సిద్ధం చేసుకున్నాం. ఈ కారణంగానే మాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అన్ని భాషలకు చెందిన ప్రజలు మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. రీమేక్ హక్కుల కోసం అడుగుతున్నారు.” అని వివరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్నారు.