Pawan Kalyan: ఆ తేదీన వీరమల్లు కచ్చితంగా రిలీజవుతుందా?

  • August 22, 2022 / 04:26 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే అనే సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ విషయంలో హరిహర వీరమల్లు రంగస్థలం సినిమాను ఫాలో అవుతుండటం గమనార్హం.

2018 సంవత్సరం మార్చి నెల 30వ తేదీన విడుదలైన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లు 2023 సంవత్సరం మార్చి 30వ తేదీన విడుదలవుతుందని చెప్పారు. నిర్మాత చేసిన ప్రకటనతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమాతో పవన్ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. రెండు వారాల గ్యాప్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.

హరిహర వీరమల్లు మూవీ గ్రాండియర్ కాబట్టి ఈ సినిమా షూట్ ఆలస్యమవుతోందని ఏఎం రత్నం వెల్లడించడం గమనార్హం. ఈ రెండు సినిమాలు హిట్ కావాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ఒక విధంగా ఈ సినిమా రిజల్ట్ పై క్రిష్ కెరీర్ ఆధారపడి ఉందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్న హరిహర వీరమల్లు మార్చి 30వ తేదీన రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus