సైరా నరసింహారెడ్డి రేంజ్ మాములుగా లేదు!

  • August 23, 2017 / 08:25 AM IST

30ఏళ్ల సుధీర్గ సినిమా ప్రస్థానం తరువాత పోలికల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కాస్త వెనుక పడ్డ చిరు మళ్ళీ సినిమా ఎంట్రీతో ప్రభజనం సృష్టించాడు. అయితే అదే క్రమంలో చిరు 150 సినిమాగా వచ్చిన ఖైదీ150 మంచి హిట్ ను అందుకుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఫోకస్ అంతా 151సినిమాపై పెట్టాడు. ఇక ఆ సినిమా మోషన్ పోస్టర్ నిన్న విడుదల కావడంతో ఈ సినిమా అనేక ప్రభంజనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడం ఖాయం అనే చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే….మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఎన్నో సంచలనాలు సృష్టించబోతుంది అని ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూని చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమాతో బిగ్ బీ సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చు…ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఇందులో భాగం అవుతూ ఉండడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క  తమిళ నటుడు విజయ్ సేతుపతి సైరా లో ఉన్నాడు.

ఇవన్ని ఒక ఎత్తైతే మ్యూజిక్ డైరక్టర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఈ ప్రాజెక్ట్ తో ఓ కొత్త జోష్ తెచ్చిపెట్టింది. అకడెమీ అవార్డ్ అందుకున్న రెహమాన్ సైరా నరసింహారెడ్డి ప్రెస్టిజియస్ సినిమాకు మ్యూజిక్ అందించడం గొప్ప విషయమని చెప్పాలి. మొత్తానికి అనుకున్న దాని కన్నా భారీగానే సైరా నరసింహారెడ్డి సెట్స్ మీదకు వెళ్తుంది. మోషన్ పోస్టర్ తో ఊపు తెచ్చిన ఈ సినిమా ఇదే జోష్ సినిమాలో కూడా ఉండేలా కోరుకుంటున్నారు మెగా అభిమానులు. మరి ఈ భారీ తారాగణం భారీ హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus