ఆ సినిమా సీక్వెల్ లో నటిస్తా

  • February 8, 2018 / 12:44 PM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వెబ్ మూవీ ‘గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించారు. వర్మ మాత్రం నిషేధాన్ని పక్కన పక్కన పెట్టి ఈ మూవీ ఘన విజయం సాధించిందని, అందుకే జీఎస్టీ-2 తీస్తానని ప్రకటించారు. అందులో ఎవరు నటిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే జీఎస్టీ-2 లో హాట్ యాంకర్ రష్మీ నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు.. ఆ విషయాన్నీ రష్మీనే అడిగారు. “జీఎస్టీ-2″లో నటించేందుకు ఆర్జీవి ఛాన్స్ ఇస్తే నటించేందుకు సిద్ధమా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

అందుకు రష్మీ ” జీఎస్టీ-2లో కాదుకానీ, ‘జీటీ-2′(గుంటూరు టాకీస్-2)లో నటించేందుకు సిద్ధం… అది కూడా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తేనే” అంటూ సమాధానమిచ్చింది. ఆమె తెలివైన సమాధానానికి నెటిజనులు ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో రష్మీ నటించినప్పటికీ రాని గుర్తింపు గుంటూరు టాకీస్ తో దక్కించుకుంది. దాని తర్వాత అంత హిట్ కొట్టే సినిమా చేయలేకపోయింది. అటువంటి స్క్రిప్ట్ కోసం చూస్తోంది. గుంటూరు టాకీస్-2 తీస్తామని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అధికార ప్రకటన రాలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus