రేష్మి ని వేదిస్తున్నారా??

  • November 29, 2016 / 01:59 PM IST

రేష్మి….బుల్లి తెరపై హాట్ యాంకర్ గా జబర్దస్థ్ ప్రోగ్రామ్ ను టాప్ స్థానానికి తీసుకెళ్లింది… ఇంకా చెప్పాలి అంటే అసలు చాలా మంది ప్రేక్షకులు రేష్మి కోసమే ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటే వినడానికి వింతగా ఉన్నా…నమ్మక తప్పల్సిన నిజం. ఇదిలా ఉంటే బుల్లి తెరపై ఈ ప్రోగ్రామ్…ఆ తరువాత మరి కొన్ని స్టేజ్ షోస్ చేస్తూ..సినిమా అవకాశాలతో సైతం బిజీ బిజీగా గడుపుతున్న ఈ  భామకు ఒక కొత్త చిక్కు వచ్చి పడిందని ఆమె సన్నిహితుల నుంచి తెలుస్తున్న సమాచారం…ఇంతకీ ఏంటి ఆ చిక్కు అంటే…రేష్మి కి సినిమాల్లో పెద్ద హిట్స్ లేకపోయినా….ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది…అయితే టాలీవు నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం…కొందరు అభిమానులు రష్మి ఫోన్ నెంబర్ తెలుసుకుని ప్రతిరోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారట.

ఇలా తనకు పరిచయం లేని చాలమంది నుండి రోజుకు  50 నుండి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయట. అయితే అసభ్యంగా మాత్రం మాట్లాడటం లేదట. మీరంటే ఇష్టం కేవలం మీ మాటలు వినడానికే ఫోన్లు చేస్తున్నామని ఆ వీరాభిమానుల మాటలు అట.  దీనితో వీటిని వేధింపులు అనాలో ? మరేమనాలో  అర్థం కావడం లేదని రష్మి తన సన్నిహితుల వద్ద గగ్గోలు పెడుతున్నట్లు టాక్. పోనీ నంబర్ మార్చేయ్యవచ్చుగా అంటే…సినీ ఇండస్ట్రీలోని చాలమందికి ఇదే నెంబర్ ద్వారా కాంటాక్ట్ లో ఉందట రష్మి. దీనితో ఫోన్ నెంబర్ మార్చలేని పరిస్థితి రష్మికి ఏర్పడిందని తెలుస్తోంది.  కనీసం ఈవిషయం పోలీసులకు చెపుదాము అనుకుంటే ఇది కంప్లయింట్ చేసే అంత పెద్దసమస్య కాదు అని రష్మి భావిస్తున్నట్లు టాక్.  మొత్తానికి అటూ కాక…ఇటు కాక…సతమవుతుంది రేష్మి గౌతమ్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus