హాట్ యాంకర్ రష్మీ లైఫ్ పార్టనర్ గురించి చెప్పేసింది..!
May 4, 2019 / 01:04 PM IST
|Follow Us
‘జబర్దస్త్’ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది హాట్ యాంకర్ రష్మి. బుల్లితెర పై పలు షోలకు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. టీవీ షోల్లోనే పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తూ ఉండే రష్మీ సినిమాల్లో మాత్రం ఆగుతుందా… అందులో కూడా గ్లామర్ షో ఓ రేంజ్లో చేస్తూ శృంగార సన్నివేశాల్లో కూడా దుమ్మురేపుతుంటుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేసి వాటికి రక రకాల కామెంట్లు పెడుతుంటుంది. అప్పుడప్పుడూ అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తుంటుంది.
ఒకవేళ ఆమెకు చిర్రెత్తుకొచ్చే ప్రశ్నలు అడిగితే.. ఘాటుగా సమాధానాలిస్తూనే.. క్లాసులు కూడా పీకుతుంటుంది. ఇక తాజాగా.. ఓ నెటిజెన్ రష్మీ మీ లైఫ్ పార్టనర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘ప్రస్తుతం నా శరీరమే నా లైఫ్ పార్టనర్. పుట్టిన దగ్గర్నుండీ చనిపోయే వరకూ నాతో ఉండేది నా శరీరమే కాబట్టి… ఎవరికైనా లైఫ్ పార్టనర్ అంటే అది వారి శరీరమే” అంటూ ఫిలాసఫీ కూడా చెప్పుకొచ్చింది ఈ భామ. ఏమైనా 3 పదుల వయసు దాటేస్తున్నా రష్మీ పెళ్ళి చేసుకునేలా లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.