Rashmi: మాంసాహారులపై రష్మీ షాకింగ్ పోస్ట్ వైరల్!

  • October 18, 2022 / 12:25 PM IST

స్టార్ యాంకర్ రష్మీ ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లోని షోలతో బిజీగా ఉన్నారు. మరోవైపు రష్మీ సినిమాలలో నటిస్తుండగా త్వరలో రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమాలు, టీవీ షోల ద్వారా రష్మీ భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టారని సమాచారం అందుతోంది. అయితే రష్మీ జీవహింసకు వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే. గతంలో జీవహింసకు వ్యతిరేకంగా రష్మీ చేసిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి.

అయితే రష్మీ చేసే కామెంట్ల విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆమె కామెంట్లను సపోర్ట్ చేస్తే మరి కొందరు మాత్రం ఆమె కామెంట్లను వ్యతిరేకిస్తున్నారు. అయితే రష్మీ తాజాగా మాంసాహారులకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు. పెరిగేవి తినండి.. పుట్టేవి కాదు అని రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాంసాహారులకు చురక అంటిస్తూ రష్మీ చేసిన పోస్ట్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మూగజీవాల సంరక్షణ కోసం రష్మీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రష్మీ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా రష్మీ మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. రష్మీ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటించాలని అభిమానులు సూచిస్తున్నారు. కెరీర్ విషయంలో రష్మీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రష్మీ సినీ కెరీర్ లో గుంటూరు టాకీస్ మినహా మరో సక్సెస్ లేదు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రష్మీ రేంజ్ మరింత పెరుగుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రష్మీ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. రష్మీ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ యాంకర్ గా స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus