టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో రష్మిక నటిస్తున్నారు. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని రష్మిక చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గుడ్ బై సినిమాలో అమితాబ్ సార్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కిందని ఇంతకంటే లక్ ఏముంటుందని రష్మిక అన్నారు.
అమితాబ్ సార్ డెడికేషన్ తనకు ఎంతో స్పూర్తిని ఇచ్చిందని ఆమె అన్నారు. కరోనా విజృంభించిన సమయంలో కూడా తాను షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కు వెళ్లేదానినని రష్మిక అన్నారు. అయితే షూటింగ్ కు వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొనేదానినని రష్మిక పేర్కొన్నారు. పరిస్థితులకు భయపడుతూ ఇంట్లోనే కూర్చుని ఉండటం సరికాదని రష్మిక వెల్లడించారు. కోట్ల రూపాయలతో సినిమాను నిర్మిస్తారని మన వల్ల షూటింగ్ ఆగితే నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో తాను తన తల్లిదండ్రుల మాట కూడా విననని రష్మిక పేర్కొన్నారు. డ్యూటీని మాత్రం మిస్సయ్యే ప్రసక్తే లేదని రష్మిక చెప్పుకొచ్చారు. రష్మిక డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లో టాప్ టక్కర్ మ్యూజిక్ వీడియో ద్వారా రష్మికకు నేషనల్ క్రష్ అనే పేరు వచ్చింది. హిందీ ప్రేక్షకుల్లో డబ్బింగ్ సినిమాలతో పాపులారిటీని సంపాదించుకున్న రష్మిక స్ట్రెయిట్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?