ఛలో సినిమాతో రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తర్వాత రోజుల్లో నటించిన సినిమాలు సైతం హిట్లుగా నిలిచాయి. సినిమాసినిమాకు క్రేజ్ పెంచుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ శర్వానంద్ కు జోడీగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రష్మిక మరో జన్మ ఉంటే మగాడిగా పుడతానని చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో తాను పెళ్లిచూపుల పేరుతో అమ్మాయిలు పడే కష్టాలను చూశానని తెలిపారు. అమ్మాయిలు పెళ్లి చూపులలో ఇష్టం ఉన్నా లేకపోయినా చీరలు, పూలు ధరించి తల దించుకొని మగాడి ముందు కూర్చోవాల్సి ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఎదుర్కొనే ఈ బాధలు చూసిన తర్వాత మరో జన్మ ఉంటే మగాడిలా పుట్టాలని అనిపిస్తోందని రష్మిక తెలిపారు.
మరో జన్మ గురించి రష్మిక చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లి కొడుకు అంటే ఇలా ఉండాలి అని తాను అనుకోవడం లేదని ఆమె వెల్లడించారు. మంచివాడైతే తనకు చాలు అని ఆమె పేర్కొన్నారు. రష్మిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఒక హీరోతో రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా రష్మిక ఇప్పటికే ఆ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.
రష్మిక మగాడిలా పుట్టాలని కోరుకోవడం కంటే ఆమె చెప్పిన కారణాన్ని విని నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయి అయితే కాలుపై కాలు వేసుకుని ప్రశ్నలు అడగవచ్చని రష్మిక వెల్లడించడం గమనార్హం. రష్మిక త్వరలో పుష్ప ది రూల్ షూటింగ్ తో బిజీ కానున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక డీ గ్లామరస్ రోల్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రష్మిక చేతిలో సినిమా ఆఫర్లు ఉన్నాయి.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!