Ram, Rashmika: ఫుల్ స్వింగ్ లో రామ్- బోయపాటి ల మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు..!

  • March 15, 2022 / 10:13 PM IST

‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టి అందరి మనసులు గెలుచుకుంది రష్మిక మందన. అటు తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ ‘ సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలు అయితే ఈమెను స్టార్ హీరోయిన్ ను చేశాయని చెప్పొచ్చు.ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా రష్మిక హవా నడుస్తుంది. తమిళ, కన్నడ లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Click Here To Watch Now

నేషనల్ క్రష్ ఇప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తుంది. ఓ పక్క రెండు బాలీవుడ్ సినిమాలు మరోపక్క ‘పుష్ప2’ పనులు జరుగుతున్నాయి. అలాగే రామ్‌తో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయింది రష్మిక. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్ గా రష్మిక ఎంపికయ్యింది.ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గం వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. పాన్-ఇండియా మూవీగా దీనిని తీర్చిదిద్దబోతున్నాడు బోయపాటి శ్రీను. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. లింగుసామితో ‘ది వారియర్‌’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్న రామ్…అది పూర్తయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించి లుక్ మార్చుకోవడానికి రెడీ అవుతాడని సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus