Raveena Tandon: రవీనా టాండన్.. పద్మశ్రీ రాగానే ప్లేట్ మార్చేసిందిగా..!

  • February 7, 2023 / 02:45 PM IST

రవీనా టాండన్… బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అందాల ఆరబోత విషయంలో ఈమె ఏమాత్రం తగ్గేది కాదు. ‘రథసారథి’ ‘బంగారు బుల్లోడు’ ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. గత ఏడాది వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మెప్పించింది. ఇలాంటి పాత్రల కోసం ఆమె గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది.

50 ఏళ్ళ వయసొచ్చినా ఆమె నాజూకైన అందాలు చూస్తే మతిపోవడం ఖాయం. అయితే ఇటీవల ఆమెకు పద్మశ్రీ ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆమె తన ఇమేజ్ కు భంగం కలుగకుండా ‘గౌరవం’ అనే మెరుగులు దిద్దాలని ప్రయత్నిస్తుంది. ఆమె తాజా ఇంటర్వ్యూలు చూసినా.., చదివినా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కొన్ని విషయాలను ఆమె కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. గతంలో ఈమె ఎప్పుడూ గ్లామర్ షో చేయనట్టు, దాని జోలికి వెళ్ళనట్టు ఈమె మాట్లాడుతుంది.

అంతేకాదు ఈమె తన కెరీర్లో రెండు రేప్ సీన్లలో నటించిందని, కానీ ఆ రెండిటిలో తన డ్రెస్ కు చిరుగులు ఉండవని.. ఆ సన్నివేశాల్లో కూడా అస్లీలత ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. రవీనా టాండన్ ఈ రేంజ్లో డబ్బా కొట్టుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈమె గతంలో చేయని ఇంటిమేట్ సీన్ లేదు, లిప్ లాక్ లు వంటివి లేవు, వాన పాటలు వంటివి కూడా లేవు.

యూట్యూబ్ లో రవీనా టాండన్ అని సెర్చ్ చేస్తే ఈమె నటించిన గ్లామర్ రోల్స్, సాంగ్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. చేతిలోనే ప్రపంచం ఉన్న రోజుల్లో ఈమె ఇలాంటి విషయాలను ఎలా కప్పిపుచ్ఛాలనుకుంటుందో ఈమెకే తెలియాలి.!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus