హారర్ చిత్రాలకి ‘రవిబాబు మాస్టర్’ అంటున్న మహేష్ బాబు..!

  • October 1, 2019 / 01:00 PM IST

‘అల్లరి” చిత్రంతో దర్శకుడిగా మారి.. కామెడీ చిత్రాన్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఎలా ప్రెజెంట్ చేయొచ్చో.. చెప్పి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ రవిబాబు. ఆ తరువాత ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే అడల్ట్ కామెడీ చిత్రంతో కూడా హిట్టందుకుని ఫుల్ ‘సోగ్గాడు’ చిత్రం షాకిచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘పార్టీ’ అనే చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. రవిబాబు రొటీన్ అయిపోయాడు. అన్నీ కామెడీ సినిమాలే చేస్తున్నాడు అనే కామెంట్స్ ఫేస్ చేశాడు. ఇలాంటి కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ‘అనసూయ’ ‘నచ్చావులే’ ‘అమరావతి’ ‘అవును’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక తాజాగా ‘ఆవిరి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రవిబాబు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదల చేశాడు. హారర్ అంశాలతో ఈ టీజర్ ను కట్ చేశాడు రవిబాబు. ప్రేక్షకుల నుండీ కూడా ఈ టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ‘ఆవిరి’ టీజర్ చూసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు కూడా రవిబాబు పై ప్రశంసలు కురిపించాడు. తన ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు స్పందిస్తూ.. “అన్ని చిత్రాల్లోకల్లా హారర్‌ జానర్‌ మూవీసే ఎక్కువుగా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి హారర్ మూవీస్ ను తీయడంలో రవిబాబు మాష్టర్‌’.. ‘ఆవిరి’ చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ రవిబాబుకి ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈ మధ్యకాలంలో రవిబాబుకి సరైన హిట్టు లేదు. గతేడాది వచ్చిన ‘అదుగో’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో ‘ఆవిరి’ తో ఎలా అయినా హిట్టుకొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇలాంటి టైములో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ‘ఆవిరి’ టీజర్ పై ట్వీట్ చేయడం అంటే.. రవిబాబు కి మంచి సపోర్ట్ దొరికినట్టే అని చెప్పాలి.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus