Ravi Teja: తన కొడుకు సినీ రంగ ప్రవేశం పై రవితేజ కామెంట్స్!
April 3, 2023 / 10:21 AM IST
|Follow Us
మాస్ మహారాజ్ రవితేజకి ఇప్పుడు 55 ఏళ్ళు. అయినప్పటికీ 30 ప్లస్ హీరోలానే సినిమాల్లో నటిస్తున్నాడు. అది కూడా రెట్టింపు స్పీడ్ తో..! అయితే రవితేజకి ఇప్పుడు 18 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అతని పేరు మహదాన్. ఆల్రెడీ అతను తన తండ్రి రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రలో చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. రవితేజ కొడుకు పై కూడా ప్రశంసల వర్షం కురిసింది.
ఆ సినిమా సక్సెస్ మీట్లలో నిర్మాత దిల్ రాజు.. మహదాన్ ను ‘నువ్వు కచ్చితంగా మహేష్ బాబు అంతటి స్టార్ హీరో అవుతావు’ అని అన్నాడు. దీంతో రవితేజ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. స్టార్ కిడ్స్ 18,19 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అందుకే వాళ్ళ ఆరాటం. తన కొడుకు ఎంట్రీ గురించి తాజాగా రవితేజకు ఓ ప్రశ్న ఎదురైంది. అది కూడా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుండి..!
‘రావణాసుర’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా .. ‘మీరు మాస్ మహారాజ్.. అందరికీ తెలుసు. నేను మీ అబ్బాయి మహధాన్ ను మాస్ యువరాజ్ అంటుంటాను. అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. మీరు అతనికి ఇచ్చే సలహా ఏంటి?’ అంటూ రవితేజని ప్రశ్నించాడు. అందుకు రవితేజ… ‘వాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. నేను సినిమాల్లోకి రమ్మని చెప్పడం లేదు.
కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంది. పూర్తిగా అది వాడి ఇష్టం. అయితే నేను (Ravi Teja) వాడికి ఎటువంటి సలహా ఇవ్వను. గతంలో ఇవ్వడం జరిగింది. ఇక నుండి అయితే ఇవ్వను. వాడే అన్నీ తెలుసుకోవాలి. నేను అలాగే తెలుసుకున్నాను’ అంటూ రవితేజ సమాధానమిచ్చాడు. సో ఫైనల్ గా మహదాన్ అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమైతే ఖాయమని.. రవితేజ చెప్పకనే చెప్పాడు.