Ravi Teja: ‘దండ కడియాల్‌..’ పాట వెనుక ఇంత కష్టం ఉందా?

  • December 9, 2022 / 03:45 PM IST

రవితేజను మాస్‌ మహరాజా అని అంటారు. కానీ ఆయన మొండోడు రవితేజ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. కారణం ఆయన సినిమా విషయంలో మొండిగా తీసుకునే నిర్ణయాలే అని చెప్పొచ్చు. సినిమా నచ్చింది అంటే ఎంతవరకైనా ముందుకెళ్లే తత్వం ఆయనది. దీనికి ఉదాహరణగా గతంలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా ‘ధమాకా’ విషయంలోనూ ఇలాంటి పనే ఒకటి చేశాడు అని అంటున్నారు. కాలి గాయంతోనే ఆయన ఓ పాటలో స్టెప్పులేశారట.

‘ధమాకా’ సినిమా నుండి ఇటీవల ‘దండ కడియాల్‌.. దస్తి రుమాల్‌..’ అంటూ ఓ పాటను రిలీజ్‌ చేశారు. ఈ లిరికల్‌ సాంగ్‌కు ఇప్పుడు భలే రెస్పాన్స్‌ వస్తోంది. రవితేజ, శ్రీలీల పోటీ పడి మరి స్టెప్పులేశారు అంటూ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే రవితేజ డ్యాన్స్‌ విషయంలో ఇక్కడ ఓ విషయం గమనించాలి అంటోంది సినిమా బృందం. ఆ పాటలో రవితేజ డ్యాన్స్‌ వేయడానికి అనువుగా ఆయన కాళ్లు లేవట. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన కాలిలోకి ఇనుప చువ్వ దిగిందట.

అయితే పాట కోసం అంతా రెడీ అయ్యి, సెట్‌ రెడీ చేసుకున్నాక.. గ్యాప్‌ ఇస్తే బాగోదు అనుకుని పాటకు రెడీ అయిపోయారట రవితేజ. కాలికి గాయంతోనే డ్యాన్స్‌ వేశారట. ఆ పాట సమయంలో కాలికి కట్టుతోనే రవితేజ స్టెప్పులేశారని టాక్‌ వినిపిస్తోంది. ఆ పాట విన్నప్పుడు రవితేజకు వచ్చిన ఊపు కూడా అంత డేర్‌ చేయడానికి కారణం అని చెబుతున్నారు. దానికి తోడు సినిమా రిలీజ్‌కి డేట్‌ దగ్గర పడటంతో డేర్‌ చేశారని చెబుతున్నారు.

ఆ పాటలో రవితేజ హుషారు చూసినవాళ్లు.. కాలికి గాయం, కట్టుతో రవితేజ ఆ డ్యాన్స్‌ చేశాడు అంటే నమ్మడం చాలా కష్టం. అంత బాగా మేనేజ్‌ చేశాడు. ఎంతో మొండితనం ఉంటే కానీ.. ఇలాంటి పనులు చేయలేరు. అది రవితేజ దగ్గర టన్నులు టన్నులు ఉంది అంటున్నారు అభిమానులు. అన్నట్లు ఈ నెల 23న సినిమాను విడుదల చేస్తున్నారు. ఫుల్‌ ఫన్‌ అని ఈ మధ్యే రవితేజ చెప్పాడు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus