సూర్య చేసిన పనికి షాక్ తిన్న రవితేజ

  • December 22, 2017 / 11:40 AM IST

మాస్ మహారాజ్ రవితేజ విభిన్న పాత్ర పోషించిన ‘రాజా ది గ్రేట్’ అందరి మనసులను గెలుచుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించింది. ప్రస్తుతం నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండతో “టచ్ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వక్కంతం వంశీ రాసిన ఈ కథలో మాస్ మహారాజ్ మరోసారి పోలీస్ గా అదరగొట్టనున్నారు. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజకి సూర్య షాక్ ఇచ్చారు. ఎలాగంటే.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన “స్పెషల్ 26 ” అనే సినిమాని తెలుగులో రవితేజ చేద్దామని అనుకున్నారు. కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు.

అయితే సూర్య అదే కథతో తెలుగు, తమిళంలో వస్తున్నట్లు తెలిసింది. 2013లో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 ఆధారంగానే ”గ్యాంగ్” సినిమా తెరకెక్కిందని బాంబ్ పేల్చారు. మొన్నటివరకు ఈ విషయాన్ని దాచి ఉంచిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. నిన్న బయటికి చెప్పారు. “స్పెషల్ 26 సినిమాను బేస్ చేసుకునే ఈ కథ రాసుకున్నాం.. అలాగే రైట్స్ కూడా కొనుకున్నాము” అని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రవితేజ షాక్ అయ్యారు. తర్వాత హమ్మయ్య అనుకున్నారు. ఈ కథని సెట్స్ పైకి తీసుకెళ్లకముందే తెలిసిందని సంతోషించారు. ఇక సూర్య నటించిన గ్యాంగ్ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి జనవరి 13న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus