Khiladi: రవితేజ ఖిలాడీ మూవీ రిలీజ్ అప్పుడే!

  • July 27, 2021 / 07:17 PM IST

మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడగా సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రవితేజ నటించిన పలు సినిమాలు సెప్టెంబర్ లో విడుదలై సక్సెస్ సాధించగా ఖిలాడీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రవితేజ నటించిన సింధూరం సినిమాతో పాటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, పవర్ సెప్టెంబర్ నెలలో రిలీజయ్యాయి. అఖండ వినాయక చవితికి రిలీజ్ కానుండగా సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఖిలాడీ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రవితేజకు జోడీగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. లక్కీ మంత్ లో సినిమాను రిలీజ్ చేసి రవితేజ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి.

మరోవైపు రవితేజ శరత్ మాండవ డైరెక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నారు. రవితేజ 68వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నారు. దివ్యాంశి కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటూ తన తరువాత సినిమాలపై అంచనాలను అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం. ఒకే సమయంలో రవితేజ ఖిలాడీతో పాటు శరత్ మాండవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus