ఒకే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న రవితేజ, సమంత సినిమాలు
January 28, 2019 / 01:22 PM IST
|Follow Us
వరుస డిజాస్టర్లతో ఇబ్బందిపడుతున్న రవితేజ ఇటీవల తన కొత్త సినిమా “డిస్కో రాజా” టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న “ఓ బేబీ ఎంత సక్కగున్నవే” కాన్సెప్ట్ కు చాలా దగ్గర పోలికలున్నాయట. ఓ 70 ఏళ్ల బామ్మ మళ్ళీ 30 ఏళ్ల యువతిగా మారి తాను కోల్పోయిన ఆనందాలను తిరిగి పొందడం అనే కాన్సెప్ట్ తో సమంత సినిమా తెరకెక్కుతుంటే.. ఓ 60 ఏళ్ల వృద్ధుడు టైమ్ మెషీన్ సహాయంతో కాలంలో వెనక్కి వెళ్ళి తాను చేసిన తప్పులు సరిదిద్దుకొనే కాన్సెప్ట్ తో రవితేజ “డిస్కో రాజా” తెరకెక్కనుంది.
ఇలా రెండు సినిమాలు ఒకే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కడం అనేది కొత్త కాకపోయినా.. రెండు భారీ సినిమాలు ఈ రేస్ లో నిల్చోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరు ఎవర్ని చూసి కాపీ కొట్టారు అనేది తెలియదు కానీ.. ఇప్పుడు ఎవరి సినిమా ముందు విడుదలవుతుంది? అనేది మాత్రం చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే.. మొదట ఎవరి సినిమా విడుదలైతే వాళ్ళనే తదుపరి విడుదలైనవాళ్లు కాపీ కొట్టారని అంటారు. మరి ఎవరి ఎవర్ని కాపీ కొట్టారు, ఇది నిజంగానే ఒకే తరహా కాన్సెప్టా అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.