Ravi Teja Remuneration: మాస్ మహారాజ్ ఆ సూత్రాన్ని ఫాలో అవుతున్నారా?
May 13, 2022 / 04:53 PM IST
|Follow Us
స్టార్ హీరో రవితేజ తన రెమ్యునరేషన్ ను ఏకంగా 20 కోట్ల రూపాయలకు పెంచేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో క్రాక్ మినహా మరే సక్సెస్ లేకపోయినా రవితేజ మాత్రం సినిమాసినిమాకు పారితోషికాన్ని పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను రవితేజ ఫాలో అవుతున్నారని అందువల్లే క్రేజ్ తగ్గకముందే భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రవితేజ ఈ విధంగా పారితోషికాన్ని పెంచడం అతని కెరీర్ కు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో మాత్రం చెప్పలేము.
టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం రవితేజ ఈ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశారని వార్తలు వస్తున్నాయి. రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ఈ ఏడాది విడుదలై ఫ్లాపైన సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ వచ్చే నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు రవితేజ వరుసగా అవకాశాలను ఇస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో రవితేజపై కొంతమేర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ గతంలో తన రెమ్యునరేషన్ గురించి స్పందించి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రవితేజ రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. రవితేజ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో స్టార్ హీరోయిన్లతో కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రవితేజ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకోనున్నాయో చూడాల్సి ఉంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా రవితేజ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. రవితేజ రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.