Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ : తన వంతు నష్టపరిహారం చెల్లించిన రవితేజ!
August 2, 2022 / 03:32 PM IST
|Follow Us
వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ గతేడాది ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. ఒకటి ‘ఖిలాడి’ కాగా ఇంకోటి ఈ మధ్యనే రిలీజ్ అయిన ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ‘ఖిలాడి’ కి కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా నమోదయ్యాయి.
కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద తడబడుతుంది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లో కేవలం రూ.4.52 కోట్ల షేర్ ను మాత్రమే నమోదు చేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.13 కోట్ల నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ చిత్రానికి రవితేజ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాబట్టి నష్టాలు వస్తే అతను కూడా భరించాలి. అందుకే ఈ చిత్రం కోసం తాను తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేశాడట రవితేజ. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం రవితేజ రూ.15 కోట్లు పారితోషికం అందుకున్నట్టు భోగట్టా. తను నిర్మాతగా చేసిన మొదటి సినిమా కూడా ఇదే.
అందుకే అతను ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నష్టపరిహారం చెల్లించినట్టు తెలుస్తుంది.రవితేజ మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇతన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన హీరోలు కూడా నిర్మాతలకు అండగా నిలబడితే ఇండస్ట్రీ ఎప్పటికీ బాగుంటుంది అనే చెప్పాలి.