కాజల్ తో రవితేజ హ్యాట్రిక్

  • November 1, 2018 / 11:45 AM IST

కొన్ని కాంబినేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా రిపీట్ అవుతునే ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషనే రవితేజ & కాజల్. వీళ్ళిద్దరూ కలిసి “వీర, సారొచ్చారు” లాంటి సినిమాల్లో కలిసి నటించారు. రెండు సినిమాలూ డిజాస్టర్లే అయినప్పటికీ.. వారి కాంబినేషన్ మాత్రం ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేసింది. అందుకే ముచ్చటగా మూడోసారి జత కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు రవితేజ – కాజల్. ప్రస్తుతం తన చిరకాల మిత్రుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రవితేజ..

ఈ సినిమా అనంతరం “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించబోయే సినిమా డిసెంబర్ నుంచి మొదలుకానుంది. ఆ సినిమాలో రవితేజకు జోడీగా ముగ్గురు కథానాయికలు నటించనుండగా.. అందులో మెయిన్ హీరోయిన్ గా కాజల్ నటించనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. మిగతా హీరోయిన్స్ గా “నన్ను దోచుకుందువటే” ఫేమ్ నభ నటేష్ మరియు “భలే మంచి రోజు” ఫేమ్ వామిఖా గబ్బీ కనిపించనున్నారు. మరి రవితేజ-కాజల్ ల క్రేజీ కాంబినేషన్ ఈసారి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus