రవితేజ ‘టచ్ చేసి చూడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • January 9, 2018 / 12:58 PM IST

మాస్ మహారాజ్ రవితేజ అంధుడిగా నటించిన ‘రాజా ది గ్రేట్’ విజయంతో రవితేజ ఫుల్ రీఛార్జ్ అయ్యారు. ఆ జోష్ తో నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాని వేగంగా కంప్లీట్ చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీని మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు. జనవరి ఆఖరి వారంలో థియేటర్లో సందడి చేయనున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అప్పుడు కూడా రావడం లేదని “టచ్ చేసి చూడు” చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 2 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. వక్కంతం వంశీ రాసిన ఈ కథలో మాస్ మహారాజ్ మరోసారి పోలీస్ గా అదరగొట్టనున్నారు.

ఆ హంగామా ఎలా ఉండబోతుందో చిన్న టీజర్ ద్వారా డైరక్టర్ విక్రమ్ రుచి చూపించారు. పవర్ సినిమా తర్వాత అంతటి పవర్ గా ఇందులో కనిపించబోతున్నట్లు టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రానికి ప్రీతమ్ మంచి పాటలు అందించినట్టు సమాచారం. ఆ పాటల రిలీజ్ వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది. రవి తేజ మాత్రం “టచ్ చేసి చూడు” పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాలుపంచుకుంటూనే సోగ్గాడే చిన్ని నాయన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సైతం అదే వేగంతో రవితేజ పూర్తి చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus