Ravi Teja: ఎన్నడూ లేనిది… రవితేజలో ఈ మార్పేంటబ్బా!
December 14, 2022 / 03:12 PM IST
|Follow Us
మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకటి ‘ఖిలాడి’ మూవీ. రెండోది ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘ఖిలాడి’ ఓపెనింగ్స్ తో కొంచెం మెరుపులు మెరిపించినా వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయిపోయింది. ఇక ‘రామారావు ఆన్ డ్యూటీ’ మొదటి రోజు నుండే ప్లాప్ టాక్ తో చతికిలపడిపోయింది. మరో వారం రోజుల్లో ‘ధమాకా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.
త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అని అంతా అనుకుంటారు. పైగా ఈ సినిమా టీజర్, పాటలు వంటివి బాగానే ఉన్నాయి. కాబట్టి.. ‘ధమాకా’ రవితేజకి కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రవితేజ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. రవితేజ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనపడదు.
తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తప్ప ఎక్కువగా ట్వీట్లు వంటివి వేయడు. సినిమా ఈవెంట్లకు తప్ప ఎక్కువగా ఎక్కడికీ వెళ్ళడు. అయితే ఇప్పుడు రవితేజలో కొత్త మార్పు గమనించవచ్చు . ‘ధమాకా’ విషయంలో మాత్రం… రవితేజ రిలీజ్ కు చాలా టైం ఉండగానే ప్రమోషన్లు మొదలుపెట్టాడు.ఇందులో భాగంగా ‘ఢీ’ షో గెస్ట్ గా వెళ్ళాడు. ట్విట్టర్లో.. అభిమానులతో చాట్ చేసి వాళ్ళను సంతోషపెట్టాడు. అంతేకాదు ఫ్యాన్స్ మీట్ కూడా పెట్టాడు.
గోదావరి జిల్లాల్లోని రవితేజ అభిమానులు ఈ మీట్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. వాళ్ళతో ఫోటోలు కూడా దిగాడు. ఇవన్నీ కూడా ‘ధమాకా’ పై పాజిటివ్ వైబ్స్ ఏర్పడేలా చేశాయి. ప్రమోషన్ల వాల్యూ రవితేజకి ఇప్పటికి తెలిసొచ్చినట్టుంది. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే.. రవితేజ తన నెక్స్ట్ సినిమాలను ఇంకా బాగా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి.