తమిళ సూపర్ హిట్ చిత్రాన్ని తలపిస్తున్న క్రాక్ టీజర్

  • February 24, 2020 / 01:16 PM IST

ఈమధ్య రవితేజ టైమ్ అస్సల బాలేదు. నటుడిగా తాను ఎంత కష్టపడినా సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రావడం లేదు. దాంతో తనకు రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేశాడు రవితేజ. శ్రుతిహాసన్ హీరోయిన్ గా బి.మధు నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న “క్రాక్” టీజర్ మొన్న విడుదలైంది. ఓ మోస్తరుగా ఆకట్టుకున్న ఈ టీజర్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ సినిమా టీజర్ ఓ తమిళ చిత్రాన్ని గుర్తుకుచేయడం గమనార్హం.

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన “సేతుపతి” అనే చిత్రం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రాన్ని గంటా శ్రీనివాసరావు కుమారుడు హీరోగా “జయదేవ్” అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు రవితేజ “క్రాక్” టీజర్ ఆ సినిమాను గుర్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. లేడీ విలన్ ఒక్కటీ పక్కన పెడితే.. టీజర్ మొత్తం “సేతుపతి” చిత్రాన్ని గుర్తుచేసింది, మరి మలినేని గోపీచంద్ ఆ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడా లేక అఫీషియల్ రీమేకా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus