Ravi Teja: రవితేజ ‘రావణాసుర’ రీమేకా.. అసలు మేటర్ ఏంటి?
March 25, 2023 / 04:01 PM IST
|Follow Us
(Ravi Teja) ఓ భాషలో హిట్టైన సినిమాని రీమేక్ చేయడం అనేది కొత్త విషయమేమి కాదు. రీమేక్ రైట్స్ కొనుక్కుని మరీ రీమేక్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. రీమేక్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చరిత్ర కూడా టాలీవుడ్ కు ఉంది. సినిమా అనౌన్స్ చేసే రోజునే ఇది ఫలానా భాషలోని సినిమాకి రీమేక్ అని చెప్పుకోవడం కూడా మనం చూశాం. కానీ లాక్ డౌన్ తర్వాత ఈ పద్ధతి మారింది. రీమేక్ చేస్తున్నా సరే..
మా సినిమా రీమేక్ అని నిర్మాణ సంస్థ చెప్పడం లేదు. రీమేక్ రైట్స్ తీసుకున్నా సరే.. మా సినిమా రీమేక్ అని చెప్పుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘క్రాక్’ అలాగే పవన్ కళ్యాణ్- రానా ల ‘భీమ్లా నాయక్’.. రెండు కూడా రీమేక్ సినిమాలే..! అయితే అడిగితే కానీ ఆ చిత్రాల నిర్మాతలు ‘మా సినిమా రీమేక్’ అని చెప్పలేదు. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘రావణాసుర’ కూడా అంతే.!
ఇది ‘విన్సీ డా’ అనే బెంగాళీ సినిమాకి రీమేక్. తెలుగులో కామెడీ వంటివి జోడించారు.. కానీ కథ అయితే సేమ్. మొదట ‘రావణాసుర’ కథకి డైలాగ్స్ రాయమని ‘పుష్ప’ డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సాకి టీం ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా రీమేక్ అన్న సంగతి ఎక్కడా చెప్పడం లేదు. ‘మీరు ఏ సినిమాకి ఇది రీమేక్ అనుకుంటున్నారో ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి తేడా మీకే తెలుస్తుంది’ అని శ్రీకాంత్ విస్సా సమాధానం చెప్పారు.
ఇది సస్పెన్స్ తో కూడుకున్న ఇంటెన్సిటీకి గురిచేసే థ్రిల్లర్. రీమేక్ అని చెబితే వెంటనే జనాలు ఓటీటీలో చూసేసి ట్విస్ట్ లీక్ చేసేస్తారు. అందుకే మేకర్స్ ఇది రీమేక్ అని ప్రకటించడం లేదు.