Razakar Collections: ‘రజాకార్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
March 21, 2024 / 07:50 PM IST
|Follow Us
1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ కి మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం వెంటనే రాలేదు. ఆ టైంలో చోటు చేసుకున్న ఘోరాలు ఆధారంగా రూపొందిన సినిమా ‘రాజాకార్'(Razakar) . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా మార్చి 15 న రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఓపెనింగ్స్ సోసోగానే నమోదయ్యాయి.వీక్ డేస్ లో ఇక జోరు చూపించడం లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.53 cr
సీడెడ్
0.16 cr
ఆంధ్ర(టోటల్)
0.37 cr
ఏపీ +తెలంగాణ (టోటల్)
1.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.08 cr
ఓవర్సీస్
0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.21 cr
‘రజాకార్’ చిత్రం రూ.2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక 6 రోజులు ముగిసేసరికి ఈ చిత్రం రూ.1.21 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ప్రేమలు’ (Premalu) ‘భీమా’ (Bhimaa) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడటంతో ‘రజాకార్’ పెద్దగా కలెక్ట్ చేయలేకపోతోంది అని చెప్పాలి.