రీ ఎంట్రీ క్వీన్ శ్రియ

  • June 11, 2016 / 06:37 AM IST

తెలుగు సినీ పరిశ్రమ పై ‘ఇష్టం’తో 2001లో శ్రియ వెండితెరకి పరిచయమైంది. కెరీర్ తొలినాళ్లలో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో నటించింది. తన నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకుంది. బిజీ హీరోయిన్ గా మారింది. 2005 సంవత్సరంలో శ్రియ నటించినవి 9 (ప్రత్యేక పాత్రలు కలుపుకుని) సినిమాలు రిలీజ్ అయ్యాయి. తర్వాత దేవదాస్ సినిమాలో ప్రత్యేక పాటలో నర్తించింది. దీంతో శ్రియ పని అయిపోయింది. ఐటమ్ సాంగ్లు చేసుకోవలసిందే అని సినీ విమర్శకులు చెప్పారు. వారు చెప్పినట్లుగా శ్రియ తెలుగులో ఐదేళ్ళ పాటు హీరోయిన్ గా ఒక్క చిత్రం చేయలేదు. మున్నా, తులసి సినిమాల్లో ఐటమ్ సాంగ్ కే పరిమితమైంది.

ఐదేళ్ల క్రితం హీరోయిన్ గా చేసిన చివరి చిత్రం భగీరద హీరో రవితేజ తోనే మళ్లీ కథానాయికగా రీ ఎంట్రీ ఇచ్చింది. 2010లో డాన్ శీను లో అందాలు ఆరబోసి విమర్శకుల నోరు మూయించింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏ గీతలు పెట్టుకోకుండా కొమరం పులి లో స్పెషల్ సాంగ్ చేసింది. నువ్వా నేనా, లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్, పవిత్ర చిత్రాల్లో కనిపించింది. అంతే అరకొర సినిమాలు చేసుకోవాల్సిందే కొన్ని రోజుల్లో పూర్తిగా ఫేడ్ ఔట్ అయిపోతుంది అని భావించారు.
నాలుగేళ్ల తర్వాత 2014 లో కింగ్ నాగార్జున పక్కన మనం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ హిట్ అందుకుంది. 2015లో విక్టరీ వెంకటేష్ తో గోపాల గోపాల చేసి తన సత్తాను చాటింది. తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు రాణిగా మూడోసారీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. నటసింహ నందమూరి బాలయ్య వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి లో హీరోయిన్ గా ఎంపికైంది. శాతకర్ణి కి భార్యగా నటించనుంది. పదిహేనేళ్ల క్రితం చెన్నకేశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ పక్కన ఆడి పాడిన భామ.. మళ్లీ హీరోయిన్ గా అతని పక్కన నటించడం శ్రియకి ఒక్కరికే సాధ్యమైంది. అందుకే ఈమెను ఇప్పుడు అందరూ రీ ఎంట్రీ క్వీన్ అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus