వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వ్యాన్ ఇంటీరియర్ ఫోటోలు

  • July 5, 2019 / 06:26 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తనకి సంబందించిన ప్రతీది మంచి స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటుంటాడు. గతేడాది స్టైలిష్ గా ఉండే ఆఫీస్ ను డిజైన్ చేయించుకున్నాడు. ఇటీవల ఓ స్టైలిష్ కార్ వ్యాన్ ను కూడా కొనుగోలు చేసాడు. ఏడు కోట్లతో ఈ కార్ వ్యాన్ ను డిజైన్ ను చేయించుకున్నాడట బన్నీ. ఈ కార్ వ్యాన్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

తాజాగా ఈ వ్యాన్ గురించి తన సోషల్ మీడియాలో స్పందించాడు బన్నీ.. “జీవితంలో నేను కొనే ప్రతి విలువైన వస్తువు కొన్న ప్రతిసారి నాకు గుర్తొచ్చే విషయం, మీరు నాపై చూపిన అభిమానం ప్రేమ..! వాటి వలనే నేను వీటిని నేను పొందగలుగుతున్నాను. అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా వానిటీ వ్యాన్ , ఫాల్కన్” అంటూ ఆ కార్ ఇన్సైడ్ ఫోటోలను కూడా షేర్ చేసాడు.

2

3

4

5

6

7

8

9

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus