ఆ ఏరియాల్లో ‘మహర్షి’ కి నష్టాలు తప్పేలా లేవు.. కారణం అదే ?
May 18, 2019 / 06:23 PM IST
|Follow Us
‘మహర్షి’.. మహేష్ బాబు కి 25 వ చిత్రం. ఈ చిత్రంలో మంచి కాన్సెప్ట్ ఉంది. అందరి ప్రేక్షకులకి నచ్చే కథ… లెంగ్త్ సమస్య ఉన్నా… మహేష్ చిత్రం కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఓవర్సీస్, సీడెడ్ వంటి ఏరియాల్లో మాత్రం ఈ చిత్రం పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది. ఆశించిన స్థాయిలో అక్కడ కలెక్షన్లు రావడం లేదు. దీంతో అక్కడ భారీ నష్టాలు తప్పేలా లేవు అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మహేష్ యూఎస్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి ఏరియాలో కనీసం 2 మిలియన్ కూడా రాబట్టలేకపోయింది ‘మహర్షి’ చిత్రం.
ఈ చిత్రం యూ.ఎస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.5 మిలియన్ రావాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని ట్రేడ్ పండిస్తులు తేల్చేసారు. దీనికి కారణాలు ఏమిటా అని విశ్లేషించే పనిలో ‘మహర్షి’ టీం బిజీగా ఉన్నారు. రైతుల గురించి ఎంత సందేశం ఇచ్చినా మిగిలిన విషయాల్లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములానే ఫాలో కావడం అక్కడి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది. పైగా ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ తరహా ట్రీట్మెంట్ ఇందులో కూడా రిపీట్ అయినట్టు అనిపించడం చాలా వరకూ అక్కడ నెగటివ్ గా మారింది.