ప్రభాస్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వెనుక రాజకీయ కోణాలు!

  • August 18, 2020 / 09:50 AM IST

“సాహో” అనంతరం మన పాన్ ఇండియన్ స్టార్ రెబల్ స్టార్ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఆల్రెడీ “రాధేశ్యామ్” సెట్స్ మీద ఉండగానే నాగ్ అశ్విన్ తో ఒక సినిమా ఎనౌన్స్ చేసాడు ప్రభాస్. ఆ సినిమాలో హీరోయిన్ గా ఇటీవలే దీపికా పడుకొనెను కన్ఫర్మ్ కూడా చేశారు. ఈలోపే నిన్న సాయంత్రం ఉన్నట్లుండి ప్రభాస్ 22 ఎనౌన్స్ మెంట్ అంటూ సడన్ షాక్ ఇచ్చాడు ప్రభాస్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఆధ్వర్యంలో “తానాజీ” ఫేమ్ ఓం రావుత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే బాలీవుడ్ సినిమాను ఎనౌన్స్ చేశారు.

ప్రభాస్ అఫీషియల్ బాలీవుడ్ ఎంట్రీ ఈ చిత్రం. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 3డిలో రూపొందించనున్నారు. ఓం రావుత్ తన తదుపరి చిత్రంగా కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా ఎనౌన్స్ చేసి ఉన్నాడు. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కూడా ఈలోపు పూర్తైపోతే.. వీరిద్దరి కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికే 2022 అవుతుంది. సో రిలీజ్ కి మరో రెండేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ లెక్కన “ఆది పురుష్” 2023కి విడుదలైతే ఎక్కువే అనుకోవాలి. అయితే.. రామ మందిర నిర్మాణం మొదలయ్యాక ప్రభాస్ ఇప్పుడు రాముడి పాత్ర పోషించనుండడం అతడి ఇమేజ్ కు కచ్చితంగా ప్లస్ అవుతుంది.

ఇకపోతే.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్ గా ఉండడం, బీజేపీ ప్రభుత్వానికి కూడా హిందుత్వాన్ని కాస్త ఘనంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో.. ఆది పురుష్ సినిమా వెనుక రాజకీయ కోణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక దర్శకుడు ఓం రావుత్ కూడా తన గత చిత్రం తానాజీతో మరాఠీల మర్యాదను పెంచినవాడు కావడం ఈ కోణాలను స్పష్టం చేస్తోంది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం ఖాయం. సో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ కు ఇప్పట్లో ఢోకా లేనట్లే. కాకపోతే.. విడుదల తేదీల విషయంలోనూ ప్రభాస్ కాస్త జాగ్రత్తపడితే అభిమానులు కూడా ఆనందంగా ఉంటారు.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus