సీనియర్ స్టార్ హీరోలలో మల్టీస్టారర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు వెంకటేష్. ఆయన సోలో హీరోగానే చేస్తాను అని మడిగట్టుకొని కూర్చోకుండా వయసుకు తగ్గ పాత్రలు మరియు మల్టీ స్టారర్ లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అరడజను మల్టీ స్టారర్ లు చేశారు. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ తో గోపాల గోపాల, రామ్ తో మసాలా, వరుణ్ తో ఎఫ్2 చేశారు. ఇక గత ఏడాది చివర్లో మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ చిత్రం చేయడం జరిగింది.
కాగా విక్టరీ వెంకటేష్ కెరీర్ బిగినింగ్ లోనే ఓ భారీ మల్టీ స్టారర్ కి తెరదీశారట. భారత దేశ చరిత్రలో గొప్పవీరుడిగా పేరున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కథను మల్టీ స్టారర్ గా చేద్దాం అని ప్రణాళిక వేశారట. నటసార్వభౌమ నందమూరి రామారావు గారు వెంకటేష్ తో శాతకర్ణి కథతో భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ తీయాలని చూడడం జరిగింది. దీనికి సంబందించిన స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ ఓ రచయిత చేత ప్రిపేర్ చేయించారట. ఎన్టీఆర్ గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రను ఆయన కొడుకు పులమావి పాత్రను వెంకటేష్ చేయాలన్నది ప్రణాళిక అట.
ఇక అంతా సిద్ధం లాంఛనమే అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అయ్యారట. ఎన్టీఆర్ కి కొంచెం విరామం దిరికితే ఆ సినిమా చేయాలని వెంకటేష్ భావించారట. ఐతే ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయాలలో మునిగిపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. దాదాపు 30ఏళ్ల తరువాత అదే ప్రాజెక్ట్ ని బాలయ్య దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేయడం జరిగింది. ఐతే కేవలం వీరుడైన గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రను మాత్రమే ప్రధానం చేసి ఆయన కొడుకు పాత్రను బాలుడిగా చూపించారు. 2017లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.