ఉన్న సినిమాలు పూర్తి చేస్తోంది కానీ.. కొత్త సినిమా సైన్ చేయడం లేదు!
September 13, 2019 / 09:38 AM IST
|Follow Us
పెళ్లి తర్వాత హీరోయిన్స్ క్రేజ్ తగ్గిపోతుంది అనే నానుడిని బ్రేక్ చేసి.. పెళ్లయ్యాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసి.. వాటిలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి స్టార్ డమ్ ను సొంతం చేసుకొన్న కథానాయకి సమంత అక్కినేని. అయితే.. “ఓ బేబీ” ముందు వరకు వరుస సినిమాలు సైన్ చేసిన సమంత ఇప్పుడు తన స్పీడ్ కి కళ్ళెం వేసింది. గత కొన్ని నెలలుగా ఆమె ఎలాంటి కొత్త సినిమాలు సైన్ చేయలేదు. ఆల్రెడీ సైన్ చేసిన సినిమాలు కూడా కుదిరినంత త్వరగా పూర్తి చేసి ముగించేయాలని ఫిక్స్ అయ్యిందట. అందుకే.. 96 రీమేక్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసింది. అక్టోబర్ కల్లా తన పార్ట్ ను పూర్తి చేయమని చెప్పేసింది సమంత. దాంతో దర్శకనిర్మాతలు ఆమె పార్ట్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే.. ఈ కంగారు మొత్తం సమంత పిల్లల్ని కనడం కోసం ప్లాన్ చేసుకోవడం కోసమే అని తెలుస్తోంది. ఎలాగూ ఆసక్తికరమైన ప్రొజెక్ట్స్ ఏమీ రావడం లేదు. అందుకే ఒక ఏడాది గ్యాప్ తీసుకొని ఈలోపు తల్లి అయ్యి.. ఆ మధురానుభూతులను అనుభవించి.. ఓ బిడ్డకు జన్మనిచ్చి.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయవచ్చు అని ఫిక్స్ అయ్యిందట సామ్. ఈమేరకు నాగచైతన్య కూడా సమ్మతించడంతో.. మరో రెండు సినిమాల అనంతరం ఆమె కొన్నాళ్ళ గ్యాప్ తీసుకోనుందని తెలుస్తోంది.