Regina, Trisha: చాలా రోజులకు పెద్ద హీరోతో… రెజీనా లైఫ్‌లో ట్విస్ట్‌ ఇదేనా?

  • October 13, 2023 / 02:09 PM IST

కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేస్తున్నట్లు కనిపించరు కానీ… సినిమాలు అలా అలా చేసేస్తుంటారు. వికీపీడియాలో ఫిల్మోగ్రఫీ చూస్తే.. ఏంటీ ఇన్ని సినిమాలు చేసిందా? ఆ ఏడాది అన్ని సినిమాలొచ్చాయా? ఈ ఏడాది అన్ని సినిమాలొచ్చాయా అనే డౌటానుమానం కలగక మానదు. అలాంటి కథనాయికల్లో రెజీనా కసాండ్రా ఒకరు. ఇండస్ట్రీలోకి కథానాయికగా వచ్చి పదేళ్లు దాటిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఆమెకు సరైన సినిమాలు లేవు. ఇక కెరీర్‌ అయిపోతుందేమో అనే మాట కూడా వినిపించింది.

అయితే అనూహ్యంగా రెజీనా (Regina) ఓ పెద్ద హీరో సినిమాను ఓకే చేసింది అని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్లలో ఆమెను ఒక హీరోయిన్‌గా ఎంపిక్‌ చేశారట. మరో హీరోయిన్‌ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు ఆమెలాగే సీనియర్‌ నాయిక అయిన త్రిష. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో. అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘విదా ముయార్చీ’నే ఆ సినిమా. త్రిషను ఇప్పటికే ఓ నాయికగా ఎంచుకోగా… ఇప్పుడు రెజీనాను తీసుకున్నారట.

త్రిష సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మాంచి దూకుడు మీద ఉంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడు ‘లియో’లో విజయ్‌తో నటించింది. కమల్‌ హాసన్‌తో కూడా ఓ సినిమా ఓకే చేసింది. అలాగే అజిత్‌ ‘విదా మయూర్చీ’ చేస్తోంది. అందులో అజిత్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడట. రెండో అజిత్‌ పాత్రకు హీరోయిన్‌గా రెజీనాను తీసుకున్నారట. ఈ మేరకు త్వరలో అఫీషియల్ ప్రకటన ఉంటుంది అంటున్నారు.

అజిత్‌ ఫ్లేవర్‌లో సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను మగిజ్‌ తిరుమేని రూపొందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. తిరిగి మన దేశానికి టీమ్‌ రాగానే వాళ్లతో రెజీనా కలుస్తుందట. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా అప్పుడే చేస్తారని చెబుతున్నారు. అయితే పాత్ర ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కోలీవుడ్‌ సమాచారం ప్రకారం అయితే యాక్షన్‌ ఓరియెంటెడ్‌గానే ఉంటుంది అంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus