డబ్బులు కట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం చూడలేకపోతున్నారు
December 19, 2020 / 12:13 PM IST
|Follow Us
ఎమ్మెస్ రాజు చాల విరామం అనంతరం దర్శకత్వం వహించిన సినిమా “డర్టీ హరి”. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరైన రాజు గారు ఇలాంటి సినిమా ఎనౌన్స్ చేయడం ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే.. దర్శకుడిగా తన సత్తా చాటుకొనే ప్రయత్నమని ఆయన నొక్కి వక్కాణించడంతో సరే చూద్దామనుకున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని థియేటర్లలో విడుదలకు నోచుకోలేక ఓటీటీ బాట పట్టిందీ చిత్రం. పోన్లే కంటెంట్ కోసం కాకపోయినా రాజు గారి కోసం సినిమా చూద్దామనుకున్నారు జనాలు.
పాపం 120 చొప్పున యాప్ లో సినిమా టికెట్ కొనుక్కొని స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్ళందరికీ “సెర్వర్ బిజీ” అనే మెసేజులు రావడం మొదలయ్యాయి. మొదట కొత్త యాప్ కాబట్టి కామన్ లే అనుకున్నారు కానీ.. సాయంత్రం సినిమా విడుదలైతే, రాత్రి వరకు అదే తంతు కొనసాగింది. ఈమాత్రం దానికి ఓటీటీ రిలీజ్ అని హడావుడి చేయడం ఎందుకు అని నొచ్చుకున్నారు డబ్బులు పెట్టినోళ్లందరూ. అయితే.. సినిమా చరిత్రలో డిజిటల్ రిలీజ్ కు కూడా నోచుకోలేకపోయిన సినిమాగా “డర్టీ హరి” మిగిలిపోయింది.
మరి రాజుగారు ఈ విషయమై ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు కానీ.. జనాలకి మాత్రం ఇంట్రెస్ట్ పోయింది. దాంతో ఎమ్మెస్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ కు ఆదిలోనే హంసపాదు పడిందనుకోవాలి. దీనికంటే హ్యాపీగా అమెజాన్ ప్రైమ్ ;లేదా ఆహా యాప్ లోరిలీజ్ చేసినా బాగుండేది.