తెలుగు టీవీ షోల్లో టాప్ ఏది అంటే… ‘జబర్దస్త్’ అని ఠక్కున చెప్పేస్తారు మన రెగ్యులర్ టీవీ వీక్షకులు. కంటెంట్, డ్రెస్సింగ్ విషయాల్లో అడపాదడపా విమర్శలు వచ్చినా… రేటింగ్‌లో మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది జబర్దస్త్ టీమ్. వినోదం పంచడానికి కష్టపడుతున్న కమెడియన్లు, టీమ్ లీడర్లు… జడ్జి చేస్తూ, మధ్య మధ్యలో పంచ్‌లు వేసే (పేలినా పేలకున్నా) జడ్జిలు, అందాల ఆరబోతకు అడ్డు చెప్పని యాంకర్లతో షో కలర్ ఫుల్‌గా సాగిపోతుంది. స్కిట్లు వేసే ఒక్కో టీమ్ ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో తెలుసా? జడ్జిలకు ఎంతిస్తారో తెలుసా? యాంకర్లకు ఎంత ముట్టజెపుతారో తెలుసా?
మాకెందుకు తెలియదు గెలిచిన టీమ్‌కి ఆఖరులో ₹25 వేలు చెక్కు ఇస్తారు కదా అంటారా.. అయితే అది కేవలం చూపించేది మాత్రమే. స్కిట్ వేసే ప్రతి టీమ్‌కి వేర్వేరు రెమ్యూనరేషన్లు ఉంటాయి. సీనియర్లు, జూనియర్లు, పాపులర్, రీసెంట్ పాపులర్ ఇలా చాలా రకాల పారితోషికాలు ఉంటాయి. ప్రతి నెల నాలుగు ఎపిసోడ్లు వస్తుంటాయి కదా.. వాటి మొత్తానికి కలిపి పేమెంట్ ఒకేసారి ఇస్తుంటారట. టీమ్ మొత్తానికి ఒక చెక్కు మాత్రమే వస్తుంది. టీమ్ లీడర్ అందులోంచి అందరికీ పంచుతాడని టాక్.
జడ్జిగా చాలా రోజుల నుంచి ఉన్న రోజాకు నెలకు ₹ 25 లక్షల నుంచి ₹30 లక్షల వరకు అందుతోందట. అలాగే సుమారు 10 నెలల క్రితం వచ్చిన సింగర్ మనోకు ₹10 నుంచి ₹12 లక్షలు వస్తోందని టాక్. సీనియర్ యాంకర్ అనసూయకు ₹5- ₹7 లక్షలు ఇస్తుంటే, రష్మీకి ₹4- ₹5 లక్షల వరకు ఇస్తున్నారట. పాపులర్ టీమ్ లీడర్స్ అయిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆదికి కూడా ₹4 – ₹5 లక్షల వరకు అందుతోందట. రీసెంట్ సెన్సేషన్ ఇమ్మాన్యుయేల్‌కు ₹1.5 లక్షల నుంచి ₹2 లక్షల వరకు ఇస్తున్నారట. అయితే ఇదంతా మల్లెమాల టీమ్‌తో అగ్రిమెంట్ ఉన్నవాళ్ల లెక్క. అగ్రిమెంట్లో లేని వారికి ఎపిసోడ్‌కి ఇంత అని ఇస్తారట.