మొత్తానికి తన రెండో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య..?

  • June 13, 2019 / 03:01 PM IST

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నాక మరో వివాహం చేసుకుంటున్నానంటూ రేణు దేశాయ్ ఎప్పుడో ప్రకటించింది. దీనికి కొందరు పవన్ అభిమానులు మాత్రం రక రకాలుగా ఆమె పై కామెంట్లు పెడుతూ వచ్చారు. దీనికి చాలా వరకూ ఓపికగా సమాధానం చెప్పుకొచ్చిన రేణు చివరికి ఓపిక నశించి పవన్ అభిమానుల పై మండిపడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే మరోపక్క ఆమెకు నిశ్చితార్థం అయినట్టు ఫోటోలు పెట్టింది కానీ.. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులయ్యింది.. అందులోనూ చాలా పెళ్ళి ముహుర్తాలు వచ్చి వెళ్ళాయి.. అయినప్పటికీ రేణు వివాహం జరుగలేదు.

దీంతో అందరూ ఆమె వివాహం ఆగిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఈ కామెంట్స్ కు బ్రేక్ వేసే ఉద్దేశంతో రేణు దేశాయ్ తాను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఈ ఫోటోలను తన సోషల్ మీడియా పోస్ట్ చేసి.. ‘ఈ ఫోటోలు తీసింది తనకి కాబోయే భర్తే’ అంటూ పేర్కొంది. ‘ఫియాన్సీ గారికి థాంక్స్’ అంటూ కామెంట్ కూడా ఇచ్చింది. మొత్తానికి తన పెళ్ళి మాత్రం ఆగిపోలేదని చెప్పకనే చెప్పింది. అంతేకాదు ఆమె పెళ్ళి కూడా అతిత్వరలో ఉంటుందని సమాచారం. ఇక తన కొత్త సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్న రేణు దేశాయ్.. అకీరాను కూడా మరో మూడేళ్ళలో హీరోగా పరిచయం చేసే పనుల్లో ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus