ఈ టైములో కూడా రూమర్లేంటి : రేణూ దేశాయ్

  • March 28, 2020 / 06:28 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 26 వ చిత్రం ‘వకీల్ సాబ్’. వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్. దిల్ రాజు, బోణి కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హడావిడి ఈ పాటికే మొదలుకావాల్సి ఉంది. కానీ షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ డబ్బింగ్ పనులు పవన్ ఇంటి నుండీ మొదలుపెట్టేసాడు.

నిజానికి మే లోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్ధితిని బట్టి అది ఆలస్యమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటిస్తుంది అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని పై రేణూ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ…’ ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారు… ఎవరు పుట్టిస్తారు అనేది అర్ధం కావడం లేదు. జనాలకి అంత ఖాళీ ఎలా ఉంటుంది.

‘వకీల్ సాబ్’ లో నేను నటిస్తున్నాను అంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఓ పక్క కరోనా వల్ల అందరూ బెదిరిపోతున్నారు. ఆ టెన్షన్ మాకు కూడా ఉంది. ఇలాంటి టైములో మళ్ళీ ఈ రూమర్స్ ఒకటి. కరోనా గురించి తెలుసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి.తెలియని వాళ్ళకి దాని నుండీ రక్షించుకోవడం ఎలా అనేదాన్ని వివరించండి. దయచేసి అలాంటి రూమర్స్ ఆపండి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus