ఫ్యాన్స్ గోల భరించలేక ట్విట్టర్ నుంచి ఎగ్జిటైన రేణు దేశాయ్

  • June 26, 2018 / 10:26 AM IST

దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఏదైనా సరే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ ఇబ్బందికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తీడితే వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నారు సరే.. కానీ పవన్ కళ్యాణ్ సొంత సతీమణి రేణు దేశాయ్ మీద కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా దాడి చేయడం ఏంటో ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఓటరితనాన్ని అనుభవించిన రేణు దేశాయ్ ఇటీవల తన మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహమాడేందుకు నిశ్చయించుకొని ఈమేరకు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొంది.

అయితే.. రేణు రెండో పెళ్లి చేసుకోవడం ఏదో పెద్ద మహా తప్పిదంలా ఫీలైపోయిన కొందరు మతిలేని లేక చెడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే పనిగా రేణు దేశాయ్ ను నిందించడం, ట్విట్టర్ సాక్షిగా ఆమెను అసభ్యంగా మాట్లాడడం మొదలెట్టారు. దాంతో సంతోషంగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాల్సిన సమయంలో ఇలా అనవసరమైన విషయాల గురించి బాధపడడం ఎందుకు అనుకొన్న రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. వెళ్లిపోయే ముందు నెగిటివిటీ ఎక్కువవ్వడం వల్లే తాను ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నానని రేణు దేశాయ్ పేర్కొనడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus