బద్రి సినిమాలో “బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే” అని పవన్ కళ్యాణ్ పాడుతుంటే హీరోయిన్ రేణు దేశాయ్ ని కళ్లార్పకుండా చూసారు ప్రేక్షకులు. మొదటి సినిమాతోనే ఆమె సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జానీ చిత్రంలో హోమ్లీగా కనిపించి నటనతో మెప్పించారు. నటిగానే కాకుండా కొణిదెల ఇంటి కోడలుగా రేణు దేశాయ్ మెగా అభిమానులకు చాలా దగ్గరయ్యారు. ఆమె నేడు (డిసెంబర్ 4 ) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె రీల్ అండ్ రియల్ లైఫ్ సీక్రెట్స్ అందిస్తోంది.
1 . మాతృ భాష మరాఠీమహారాష్ట్రలోని పూణే లో1981 సంవత్సరంలో డిసెంబర్ 4న రేణు దేశాయ్ జన్మించారు. ఆమె మాతృ భాషా మరాఠీ. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా రేణు చదువు అనంతరం మోడలింగ్ వైపు అడుగులు వేశారు.
2 . స్పెషల్ అప్పీరియన్స్ముంబై లో మోడల్ గా బిజీగా ఉన్న సమయంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ గుక్కతిప్పుకోకుండా పాడిన పాటలో రేణు దేశాయ్ కనిపించారు. ఈ స్పెషల్ అప్పీరియన్స్ ద్వారా సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు.
3 . కోలీవుడ్ ఎంట్రీజేమ్స్ పాండ్ అంటే తమిళ సినిమా ద్వారా రేణు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదల కాకముందే తెలుగులో బద్రి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు.
4 . బద్రి కలిపిన బంధంబద్రి సినిమాలో నటిస్తున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు కలవడంతో కొంతకాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు.
5 . కాస్ట్యూమ్ డిజైనర్పవన్ కళ్యాణ్ చిత్రాలకు రేణు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం సినిమాలు సరికొత్త డిజైన్స్ ని పరిచయం చేశారు.
6 . ఇద్దరు పిల్లలుపవన్ కళ్యాణ్, రేణు దంపతులకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు. 11 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2013 లో పవన్ తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
7 . నిర్మాతపవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత సినిమాలకు రేణు మరింత దగ్గరయ్యారు. మాతృభాషలో “మంగళాష్టక్ వన్స్ మోర్ ” అనే రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించారు. సమీర్ జోషి దర్శకత్వంలో వచ్చిన ఈ మరాఠీ మూవీ యువతను ఆకట్టుకుంది.
8 . డైరక్టర్పవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన రేణు దేశాయ్ “ఇష్క్ వాలా లవ్” అనే మరాఠీ మూవీ ద్వారా మెగా ఫోన్ అందుకున్నారు. అకిరా ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ఆమె సొంతంగా నిర్మించారు. ఇందులో పవన్ తనయుడు అకిరా కూడా నటించాడు.
9 . స్నేహితుడుపవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ రేణు అతనితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోయిన ప్రభావం పిల్లలపై పడకుండా పెంచుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇప్పటికీ వదినా అని పిలుస్తుంటారు.
10 . ఖుషి 2పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఖుషి మూవీ ఒక మైలు రాయి వంటిది. ఈ చిత్రం అంటే రేణు దేశాయ్ కి భలే ఇష్టం. ఖుషి కి సీక్వెల్ తన సొంత బ్యానర్లో తీయాలనేది ఆమె కల. ఈ ఏడాది మొదట్లో దర్శకుడు ఎస్.జె.సూర్య తో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే సెట్ కాలేదు. త్వరలో ఆమె డ్రీమ్ ప్రాజక్ట్ పట్టాలెక్కాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.