హైద్రాబాద్ ఇంటిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

  • February 15, 2020 / 12:36 PM IST

“పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం హైద్రాబాద్ లో ఖరీదైన ఇల్లు కొన్నాడు” అని టీవీ చానల్స్, వెబ్ సైట్స్ & కొన్ని న్యూస్ పేపర్స్ కూడా కొన్ని రోజులుగా పలు కథనాలు ప్రచురించాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ అందరూ.. “మా అన్న పిల్లల మంచి ఇల్లు కొన్నాడు” అంటూ మురిసిపోయారు. అయితే ఇక్కడ అకీరా-ఆద్యాల కోసం హైద్రాబాద్ లో ఇల్లు కొనడం వాస్తవం అయినప్పటికీ.. ఆ ఇల్లు పవన్ కళ్యాణ్ కొన్నాడు అనేది మాత్రం అబద్ధం అని తెలుస్తోంది. ఆ ఇల్లు కొన్నది రేణు దేశాయ్. తాను దర్శకురాలిగా, నిర్మాతగా బెంగాలీలో తెరకెక్కించి, నిర్మించిన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆ ఇల్లు కొన్నది రేణు దేశాయ్.

దాంతో.. ఆ ఇల్లు పవన్ కళ్యాణ్ కొన్నాడు అని వస్తున్న కథనాల విషయంలో ఆవిడ చాలా హర్ట్ అయ్యింది. “దయచేసి ఏదైనా రాసేటప్పుడు లేదా ప్రసారం చేసేటప్పుడు కనీస స్థాయి అవగాహనతో చేయండి, అలాగే.. సింగిల్ మదర్ కి కాస్త రెస్పాక్ట్ ఇవ్వండి” అని సోషల్ మీడియా సాక్షిగా తన బాధను వెలిబుచ్చుకుంది.


Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus