పవన్ కి లీడర్ గా రేణు ఎన్ని మార్కులు వేసిందో తెలుసా?
March 6, 2017 / 07:43 AM IST
|Follow Us
నటి, నిర్మాత రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మార్కులు వేసింది. అతనితో డేటింగ్ చేసి, పెళ్లిచేసుకొని, విడాకులు తీసుకొని విడిగా జీవిస్తున్న ఈమె తన మాజీ భర్తకు వివిధ అంశాల్లో మార్కులు ఇచ్చింది. మహిళా దినోత్సవం (మార్చి 8 ) సందర్బంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర సంగతులు వెల్లడించింది. ” పవన్ కు ఒక భర్తగా 4, 5 మార్కులే వేస్తాను. తండ్రిగా మాత్రం 10 కి 10 . నటుడిగా10 కి 10 , పొలీటీషియన్ గా 10 కి 10 మార్కులు వేస్తాను” అని రేణు దేశాయ్ వెల్లడించింది.
లీడర్ గా పదికి పది మార్కులు వేయడంతో జనసేన పార్టీ పై ఆమెకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ ” అకీరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే ‘ఖుషీ’ మూవీని తీసుకుంటాను.” అని చెప్పింది. పవన్ డైరక్ట్ చేసిన జానీ మూవీ గురించి మాట్లాడుతూ “జానీ అసలు కథ చాలా బాగుంటుంది. కమర్షియల్ హిట్ కోసం కథను మార్చాము. ఇప్పుడు నాకు అవకాశం ఉంటే దాన్ని రీమేక్ చేస్తాను” అని రేణు వివరించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.