పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నందుకు బాధ పడుతున్న రేణు దేశాయ్
March 8, 2017 / 10:35 AM IST
|Follow Us
రేణు దేశాయ్ నటిగా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భార్యగా ఎక్కువమందికి పరిచయం. బద్రి సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి.. కొన్నేళ్లు సహజీవనం చేశారు. అకీరా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. పాప ఆద్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పవన్ విదేశీ అమ్మాయిని పెళ్లిచేసుకోగా, రేణు మాత్రం పిల్లల్తో కలిసి జీవిస్తోంది. ఎప్పుడూ అభిమానులతో సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే ఈమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించింది. తాను పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాప పడింది.
పెళ్ళికి ముందు ఎంతో ఆనందంగా ఉన్నామని, అలాగే కొనసాగి ఉంటే.. పవన్ పై ఎవరూ విమర్శలు చేసేందుకు అవకాశం ఉండేది కాదని అభిప్రాయపడింది. ఇంకా ఆయనకు మార్కులు వేసింది. “ఒక భర్తగా 4, 5 మార్కులే వేస్తాను. తండ్రిగా మాత్రం 10 కి 10.” అంటూ వివరించింది. అలాగే నటుడిగా పదికి పది , పొలీటీషియన్ గా పదికి పది మార్కులు ఇచ్చింది. పవన్ రాజకీయాల్లోనూ రాణిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.