Revanth: శ్రీహాన్ – శ్రీసత్య చేసిన ఆ పని వల్లే రేవంత్ డల్ అయిపోయాడా ?
November 11, 2022 / 10:54 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం పాము – నిచ్చెనల టాస్క్ ఆడారు హౌస్ మేట్స్ ఇందులో పాముల టీమ్ లో ఉన్న శ్రీహాన్ ఈవారం కెప్టెన్సీ పోటీదారులు కాలేడు కాబట్టి అతడి ప్లేస్ లో వేరేవాళ్లకి అవకాశం ఇమ్మని చెప్పాడు బిగ్ బాస్. దీంతో శ్రీహాన్ తనకి సపోర్ట్ చేసిన శ్రీసత్యని కెప్టెన్సీ టాస్క్ లో ఆడించాడు. ఈవిషయంలో రేవంత్ బాగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, బంగారు మణి ఉన్న కారణంగా నిచ్చెనల టీమ్ ఏకాభిప్రాయంతో ఒకరిని కెప్టెన్సీ పోటీదారులగా ఎంచుకోమని చెప్పాడు బిగ్ బాస్.
అందరూ కలిసి మెరీనా పేరు చెప్పారు. ఇక్కడ కూడా రేవంత్ పేరు ప్రస్తావనికి రాలేదు. అయితే, ఈ టాస్క్ అనంతరం ఒంటరిగా గార్డెన్ ఏరియాలో బెంచ్ పైన కూర్చుని బాధపడ్డాడు రేవంత్. అసలు ఈసీజన్ కి రాకుండా ఉండాల్సిందని అన్నాడు. అంతేకాదు, తర్వాత మీరు గర్వపడేలా ఈ ఐదువారాలు వేరే లెవల్లో గేమ్ ఆడతాను, విన్నర్ అవుతాను అంటూ మాట్లాడాడు. తన భార్య ఫోటో చూస్తూ 9వ నెల వచ్చేసింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కో, ధైర్యంగా ఉండు అంటూ ఏడ్చేశాడు. చాలా డల్ అయిపోయాడు. శ్రీసత్య , శ్రీహాన్ వచ్చి అన్నం తినమని బ్రతిమిలాడారు.
తర్వాత మెరీనా వచ్చి కూడా అన్నం తినమని చెప్పింది. అన్నం తింటాను అంటూ ఒంటరిగా ఒక మూల కూర్చుని భోజనం చేశాడు రేవంత్. ఆ తర్వాత శ్రీహాన్ వచ్చి ఎంతసేపు బ్రతిమిలాడినా నార్మల్ అవ్వలేదు. అంతేకాదు, ఈరోజు నుంచీ నేను ఒంటరిగానే గేమ్ ఆడతానంటూ వాళ్లని దూరం చేస్తున్నట్లుగా మాట్లాడాడు. నిజానికి ఇక్కడ రేవంత్ ఫిజికల్ అవ్వకముందే పాము టీమ్ సభ్యులు కావాలనే రేవంత్ ని ఫిజికల్ అవుతున్నావ్, అవుతున్నావ్ అంటూ రెచ్చగొట్టారు. ఈ వీక్ నెస్ ని అడ్డం పెట్టుకుని గేమ్ ప్లాన్ వేశారు.
ఇది తెలుసుకున్న రేవంత్ బాగా హర్ట్ అయ్యాడు. అంతేకాదు, అవతల టీమ్ స్ట్రాటజీని అభినందించాడు. తన గేమ్ లో ఎగ్రెసివ్ అవుతున్నాడని ఫస్ట్ నుంచీ హౌస్ మేట్స్ కంప్లైట్స్ ఇస్తునే ఉన్నారు. ఇప్పుడు ఇదే వీక్ నెస్ ని వాళ్లు గేమ్ లో చూపించారు. దీంతో రేవంత్ ఖంగుతిన్నాడు. అంతేకాదు, నాగార్జున గారు వచ్చి మళ్లీ ఇదే మాట అని ఎల్లో కార్డ్ ఇస్తే పరిస్థితి ఏంటని ఆలోచించాడు. ఇక టాస్క్ లో ఎగ్రెసివ్ అవ్వను అని చెప్పాడు. కానీ, టాస్క ఆడకపోతే ఎలా, నేను నేనుగా లేను నా తీరుని మార్చుకోలేకపోతున్నానంటూ బాధపడ్డాడు.
ఇదే రేవంత్ బాధకి అసలు కారణం. అంతేకాదు, తన ఫ్రెండ్ అయిన శ్రీహాన్ కూడా శ్రీసత్యతో స్వాప్ అవ్వడం అనేది రేవంత్ కి నచ్చలేదు. గేమ్ లో ఎవరు బాగా ఆడారో వాళ్లని సపోర్ట్ చేయాలని చెప్పాడు. మట్టి తీస్కుని అంత కష్టపడి అందరికంటే బాగా నిచ్చెన కట్టానని, టాస్క్ లో బాగా ఆడానని అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయిందని బాధపడ్డాడు రేవంత్. మొత్తానికి రేవంత్ ఈవారం గేమ్ లో మార్పుని చూపించేలాగనే కనిపిస్తున్నాడు. వీకండ్ నాగార్జున రేవంత్ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.