అర్జున్ రెడ్డి పై వర్మ కామెంట్స్!

  • August 23, 2017 / 08:27 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటాడు…అయితే గతకొంతకాలంగా సైలెంట్ గా ఉన్న వర్మ ఇప్పుడు తన ట్వీట్ రూపంలో ‘అర్జున్ రెడ్డి’ మూవీపై తన అభిప్రాయాన్ని తెలిపాడు…ఈ సినిమా ఈ వారం విడుదాలకి సిద్దంగా ఉండగా రామ్ గోపాల్ వర్మ కొంచం ఆలస్యంగా  ఈసినిమా ట్రైలర్ గురించి స్పందిస్తూ… ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ఈసినిమా హీరో విజయ్ దేవరకొండ చాలా విషయాల్లో తనను తలపిస్తున్నాడని అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను చావకుండానే అతను ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని తనదైన శైలిలో వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.  అయితే ఈ కామెంట్స్ పై హీరో విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ ‘సార్ మీరు పుట్టకముందే నేను పుట్టడమే కాదు మీరు శివ తీసిన 1989వ సంవత్సరంలోనే నేను పుట్టాను’’ అంటూ బదులిచ్చాడు.

ఇది ఇలా ఉండగా ఎల్లుండి విడుదల కాబోతున్న ఈసినిమా విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువే హైప్ వచ్చింది. ‘పెళ్లి చూపులు’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ  కు వచ్చిన క్రేజ్ వలనో మరి ఏ కారణం వలనో తెలియకపోయినా ఈ సినిమాకు ఏర్పడ్డ భారీ అంచనాలు అందరినీ  ఆశ్చర్య పరుస్తున్నాయి. దీనికితోడు కాంట్రవర్సీలు కూడ  తోడవడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో? ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో తెలియాలి అంటే ఈ ఫ్రైడే వరకూ ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus